Mumbai: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్‌లో శుక్రవారం రాత్రి ఒక వ్యాపారవేత్త, క్రిమినల్ కేసులో కీలక సాక్షిని కాల్చి చంపారు. శాంతి షాపింగ్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో షమ్స్ తబ్రేజ్ అన్సారీ అలియాస్ సోనూ అనే 35 ఏళ్ల మహ్మద్ తబ్రేజ్ అన్సారీని కాల్చి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి షాపింగ్ సెంటర్‌లోకి ప్రవేశించి, అన్సారీని దగ్గరికి వచ్చి తన తలపై కాల్చాడు. తర్వాత సంఘటన స్థలం నుండి పారిపోయాడు.
ఇది కూడా చదవండి: Ambulance in 10 Minutes: బ్లింక్ ఇట్ కొత్త సేవలు.. 10 నిమిషాల్లో అంబులెన్స్
అన్సారీ ఒక క్రిమినల్ కేసులో సాక్షిగా ఉన్నాడు. దింతో అతనికి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో అతను పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి అని కూడా తెలిపాడు.
దాడి తర్వాత నయా నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న అని CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నింధుతుడుని పట్టుకోవడానికి సాక్ష్యాలను సేకరిస్తున్నారు పోలీసులు.
అన్సారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి. ఘటన పైన కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.