Ambulance in 10 Minutes: ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆక్సిడెంట్ అవ్వచ్చు లేదా మనకు కావాల్సిన వాళ్లకి ఒక్కసారిగా ఆరోగ్యం చెడిపోవచ్చు. అలంటి సమయంలో అంబులెన్సు కి కాల్ చేస్తే అవి సమయానికి రావొచ్చు .. ఇపుడు ఉన్న ట్రాఫిక్ కి రాకపోవొచ్చు. ఆలస్యంగా రావడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.. ఈ సమస్యను సాల్వ్ చేస్తూ ఓ కంపెనీ 10-నిమిషాల అంబులెన్స్ సేవను తీసుకొని వచ్చింది..
గురుగ్రామ్‌లో Blinkit లో కొత్తగా 10-నిమిషాల అంబులెన్స్ సేవలను తీసుకొనివచ్చింది. శిక్షణ పొందిన సిబందితో పూర్తి పరికరాలతో ఈ సర్వీస్ ని ప్రారంభించింది. యాప్ ద్వారా వినియోగదారులు త్వరలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌లను బుక్ చేసుకోగలరు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: పరీక్షను రద్దు చేయాలంటూ ప్రశాంత్ కిషోర్ ఆమరణ దీక్ష
Ambulance in 10 Minutes: Blinkit, సుప్రసిద్ధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, గురుగ్రామ్‌లో 10 నిమిషాల అంబులెన్స్ సేవను ప్రారంభించింది. ఈ సేవను జనవరి 2న CEO అల్బిందర్ ధిన్సా ప్రారంభించారు. ఇది అత్యవసర సమయాల్లో వేగవంతమైన నమ్మకమైన వైద్య సహాయాన్ని అందించడం లక్ష్యంగా దిని మొదలుపెట్టారు. ఈ సేవ ఐదు అంబులెన్స్‌ల సముదాయంతో ప్రారంభమవుతుంది.
సేవ యొక్క లక్షణాలు
అన్ని అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, AEDలు (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లు), స్ట్రెచర్లు, మానిటర్లు, చూషణ యంత్రాలు(Suction Machine), అత్యవసర మందులు వంటి ప్రాణాలను రక్షించే టూల్స్ ఇందులో ఉంటాయి. ప్రతి అంబులెన్స్‌లో క్లిష్ట సమయాల్లో నాణ్యమైన సంరక్షణను అందించడానికి ఒక పారామెడిక్, ఒక సహాయకుడు శిక్షణ పొందిన డ్రైవర్‌తో సిబ్బంది ఉంటారు.
కవరేజ్ పెరిగింది
త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. Blinkit యాప్ ద్వారా, వినియోగదారులు BLS అంబులెన్స్‌ని బుక్ చేసుకోగలరు త్వరగా వైద్య సంరక్షణను పొందగలరు.