Bureau of Indian Standards

Bureau of Indian Standards: డిల్లీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

Bureau of Indian Standards: డిల్లీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగింది. దేశ వ్యాప్తంగా నాణ్యత ప్రమాణాల బలోపేతం, హాల్‌మార్కింగ్, మరియు ఎగుమతుల పెంపు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, రాష్ట్రానికి అవసరమైన ల్యాబ్ వసతులపై ప్రతిపాదనలు సమర్పించారు.

సమావేశంలో భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్న ప్రతి ఉత్పత్తి క్వాలిటీ, సేఫ్టీ స్టాండర్డ్స్‌ను పాటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. “ప్రపంచంలోని ఐదో స్థానంలో ఉన్న భారత్, త్వరలో మూడో స్థానానికి చేరాలంటే ప్రమాణాల మెరుగుదల చాలా అవసరం,” అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీలా కాకుండా, ఫెసిలిటేటర్ సెంటర్గా BIS పనిచేస్తే, అన్ని రంగాల వారు భాగస్వాములవుతారు, అని ఆయన పేర్కొన్నారు. క్వాలిటీ స్టాండర్డ్స్, హాల్‌మార్కింగ్ వంటి విషయాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: MLC Kavitha: సింగరేణి జాగృతి ఆవిర్భావం

Bureau of Indian Standards: నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అలాగే, గుంటూరు జిల్లాలో ఫిషరీస్, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాలకు అవసరమైన సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటును కోరినట్లు చెప్పారు. ఈ ల్యాబ్‌ను ₹40–₹50 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించాలనే యోచన ఉందన్నారు.

ప్రమాణీకరణ (Certification) వల్ల వినియోగదారులకు నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో ఎగుమతుల పెరుగుదలకూ ఇది దోహదం చేస్తుంది, అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: మరోసారి ఆ రికార్డులో నెంబర్ వన్ తెచ్చుకున్న ఢిల్లీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *