Thandel Bujji Thalli Song: నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ‘బుజ్జితల్లి’ కి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ పాట ఒక్క రోజులోనే 5.4 మిలియన్ వ్యూస్ తో టాప్ 2గా ట్రెండ్ అవుతోంది. శ్రీమణి అందించిన సాహిత్యానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, జావేద్ ఆలీ వాయిస్ ఈ పాటకు ఎస్సెట్ గా నిలిచాయి. అందుకే ప్రతి మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లో ఈ పాటను శ్రోతలు పదే పదే వింటున్నారని ఆడియోను రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు చెబుతున్నారు. ఇక నాగచైతన్య, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటు చార్ట్ బస్టర్ రేంజ్ కి తీసుకువెళ్ళిందంటున్నారు. మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ స్పోటిపై, జియో సావ్న్ లో ఒక్క రోజే 150 వేల వీక్షణలను దక్కించుకుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ అధినేతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు.
