BSNL Recharge Plans

BSNL Recharge Plans: తక్కువ రీఛార్జ్.. ఎక్కువ బెనిఫిట్! జియో.. ఎయిర్‌టెల్‌ రెండిటికీ దెబ్బ కొట్టిన బీఎస్ఎన్ఎల్..

BSNL Recharge Plans: జియో లేదా ఎయిర్‌టెల్‌ ఈ రెండే మొన్నటి వరకూ అందరి ఫోన్లకు ఇంధనాలు. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ రెండిటి మధ్య పోటీకి చాలా దూరంగా ఎక్కడో ఉండేది. సాధారణంగా కొత్త సిమ్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ముందుగా ఎయిర్‌టెల్‌ లేదా జియో కోసమే చూసేవారు. తరువాతే ఇతర నెట్వర్క్స్ కోసం ప్రయత్నించే వారు. రెండో సిమ్ తీసుకునే వారుకూడా అదే పద్ధతిలో ఆలోచించే వారు. కానీ, గత ఆరు నెలలుగా ట్రెండ్ మారింది. ఎయిర్‌టెల్‌, జియో లకు పెద్ద దెబ్బ పడింది. అది బీఎస్ఎన్ఎల్ రూపంలో. ఎందుకంటే.. ఎయిర్‌టెల్‌, జియో రెండూ కూడా గత జూన్ నెల తరువాత టారీఫ్స్ పెంచేశాయి. రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు 20 శాతం వరకూ పెరిగిపోవడంతో వినియోగదారులు పక్కకు చూడడం మొదలు పెట్టారు. 

సరిగ్గా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది బీఎస్ఎన్ఎల్. సరికొత్త ప్లాన్స్ తీసుకురావడమే కాకుండా 4జీ నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా టవర్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. దీంతో కవరేజ్ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఒకపక్క కవరేజ్ పెరగడం.. రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉండడంతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకూ మొబైల్ నెట్వర్క్ రంగంలో దిగ్గజాలుగా దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌, జియోలకు షాక్ ఇచ్చింది. వినియోగదారులు జోన్ తరువాత ఎక్కువగా ఈ రెండిటి నుంచి బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: Jio: 56 రోజుల జియో బెస్ట్ రీచార్జ్ ప్లాన్.. పూర్తి వివరాలివే !

BSNL Recharge Plans: టారీఫ్స్ తగ్గించడం ఒకటే కాదు.. నెట్వర్క్ స్థాయిని పెంచడం కూడా చేసింది బీఎస్ఎన్ఎల్. ఇది కూడా కాకుండా ఐఎఫ్‌టీవీ సర్వీస్‌ పరిచయం చేసింది. అంటే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ యూజర్లకు లైవ్ టీవీ ఛానల్స్ ఎక్సెస్ చేసే అవకాశం తీసుకువచ్చింది. ఇక మొబైల్ యూజర్స్ కోసం దేశంలోనే మొట్ట మొదటిసారిగా డైరెక్ట్‌ టూ మొబైల్ సర్వీస్‌ బైటీవీ ప్రారంభించింది. దీంతో మొబైల్ లోనే 300 ఛానల్స్ వరకూ చూసే అవకాశాన్ని కల్పించింది. 

బీఎస్ఎన్ఎల్ కేవలం 108 రూపాయలతో నెలవారి ప్లాన్స్ అందిస్తోంది. ఇతర కంపెనీల టారిఫ్ లతో పోలిస్తే ఇది చాలాతక్కువ. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడంతో ఇప్పుడు యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు ఎక్కువగా చూస్తున్నారని చెప్పవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *