BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్దగా పట్టేది కాదు. కొత్తగా సిమ్ తీసుకోవాలి అనుకుంటే జియో లేదా ఎయిర్ టెల్ వైపే చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మొదటి సిమ్ జియో లేదా ఎయిర్ టెల్ ఉన్నప్పటికీ.. రెండో సిమ్ కోసం బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు అందరి దగ్గరా డ్యూయల్ సిమ్ ఫోన్లే ఉంటున్నాయి. దీంతో క్రమేపీ బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్ టెల్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయేలా పరిస్థితి మారుతోంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తక్కువ ధరలతో రీఛార్జ్ ఆప్షన్స్ అందిస్తోంది. ఇది యూజర్లను ఆకర్షిస్తోంది.
తాజాగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91తో రీఛార్జీ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. అంటే రోజుకు రూపాయి ఖర్చన్నమాట. ఇది సెకండ్ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ యూజ్ చేసేవారికి చాలా అనుకూలమైన ప్లాన్ అని చెప్పవచ్చు. సాధారణంగా సెకండ్ సిమ్ వాడేవారు తరుచు రీఛార్జ్ భారం భరించలేక దానిని అలా వదిలేస్తారు. దీంతో సిమ్ పనిచేయడం మానేస్తుంది. తరువాత మళ్ళీ అవసరం అయినపుడు వేరే సిమ్ తీసుకోవడం లేదా పాత సిమ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంటుంది.
ఇది కూడా చదవండి: BSNL Recharge Plans: తక్కువ రీఛార్జ్.. ఎక్కువ బెనిఫిట్! జియో.. ఎయిర్‌టెల్ రెండిటికీ దెబ్బ కొట్టిన బీఎస్ఎన్ఎల్..
ఇప్పుడు సెకండ్ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ వినియోగిస్తే.. మూడు నెలలకు 91 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆ సిమ్ నుంచి బయటకు కాల్ చేయాలి లేదా డేటా యూజ్ చేయాలి అనుకుంటే టాక్ టైమ్ టాప్ అప్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ టాప్ అప్స్ కూడా తక్కువ ధరల్లోని దొరుకుతాయి. సో.. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దిగ్గజ కంపెనీలకు పెద్ద షాక్ ఇస్తోందని చెప్పవచ్చు.