Telangana: కేంద్ర విమానాయాన సంస్థ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ దుండగుల నుంచి విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స వచ్చాయి. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాల్లో బాంబ్ ఉన్నదని ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆయా విమానాల్లో తనిఖీలను చేపట్టారు.