TG News:

TG News: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పురోగతి

TG News: హైదరాబాద్‌లోని బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో భారీగా ఆయుధాలు మాయమైన వ్యవహారంలో కీలక పురోగతి లభించింది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన భద్రతా బలగాలు, ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను అదుపులోకి విచారణ జరుపుతున్నారు.

ఈ విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆయుధాలన్నీ ఒకేసారి కాకుండా, గత మూడు నెలల కాలంలో ఒక్కొక్కటిగా ప్రణాళికాబద్ధంగా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
చోరీకి గురైన ఆయుధాల వివరాలు..
ఆర్మీ ఆయుధాగారం (కోట్) నుంచి అత్యంత శక్తివంతమైన యుద్ధ తుపాకులు చోరీకి గురైనట్లు స్పష్టమైంది..
  • 4 ఏకే-47 (AK-47) రైఫిళ్లు
  • 2 ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు
  • 9 అత్యాధునిక పిస్టోల్స్
మొత్తంగా 15 సర్వీస్ ఆయుధాలు పక్కదారి పట్టినట్లు లెక్క తేలడంతో రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఆర్మీ క్యాంప్ లోపల నుంచే సహకారం లేకుండా ఇంత భారీగా ఆయుధాలు బయటకు వెళ్లే అవకాశం లేదని అనుమానిస్తున్న అధికారులు.. అదుపులోకి తీసుకున్న అధికారుల నుంచి ఆయుధాల తరలింపు నెట్‌వర్క్ వివరాలను రాబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *