Delhi Elections

Delhi Elections: బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితా విడుదల.. కేజ్రీవాల్ పై పోటీ చేసేది ఎవరంటే..?

Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. జాబితాలో 29 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో 7 మంది నేతలు ఇటీవల ఆప్, కాంగ్రెస్‌లను వీడి బీజేపీలో చేరిన వారు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు పొందిన అభ్యర్థుల్లో చాలా మందికి తొలి జాబితాలోనే మళ్లీ టికెట్లు ఇచ్చింది పార్టీ. 29 మంది అభ్యర్థుల జాబితాలో 13 మంది అభ్యర్థులు రిపీట్ కాగా, కొత్తగా 16 మందికి టిక్కెట్లు ఇచ్చింది పార్టీ.

అదే సమయంలో గాంధీనగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌ బాజ్‌పాయ్‌ టికెట్‌ ఇవ్వకుండా. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీకి టికెట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ భలే చౌక.. రోజుకు రూపాయి ఖర్చు అంతే!

Delhi Elections: న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రవేశ్ వర్మ పోటీ చేయనున్నారు. కల్కాజీ నుంచి సీఎం అతీషిపై రమేష్ బిధూరి బరిలోకి దిగారు. ఈ సీటులో అల్కా లాంబాకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. బీజేపీ తొలి జాబితాలో గెలిచిన 8 స్థానాల్లో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఇప్పటి వరకు మూడు జాబితాల్లో 48 మంది అభ్యర్థులను నిలబెట్టింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *