BIRYANI: బిర్యానీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. హోటల్ కి వెళ్ళి హ్యాప్పీగా బిర్యానీ తిని రావాలని చాలా మంది అనుకుంటారు. అయితే సాధారణంగా బిర్యానీ రెటు ఎంత ఉంటుంది. రోడ్ సైడ్ హోటల్లో అయితే 200 ఉంటే ఫై స్టార్ లో అయితే 2 వేలు ఉంటుంది కదా.. కానీ ఓ చోట మాత్రం 10 రూపాయలకే బిర్యానీ వస్తుందని తెలియగానే జనం ఎగబడ్డారు. అది కూడా అన్ లిమిటెడ్ అని తెలిసాక బారులు తీరారు.. ఇంతకు ఎక్కడనుకుంటున్నారా..
ఆంధ్రప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా విరవల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న ఓ హోటల్ కేవలం 10కి అన్‌లిమిటెడ్ బిర్యానీ అని ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ చూసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా హోటల్ మీద దండయాత్రకు వెళ్లారు. ఇంకేముంది ఒక గంటలోనే బిర్యానీ గిన్నెలు పూర్తిగా ఖాళీ చేశారు కస్టమర్లు. అయితే, ఈ ఆఫర్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో హోటల్ నిర్వాహకులు ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ ప్రస్తుతం ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నంత వరకు, బిర్యానీ ప్రేమికులు హోటల్‌కు పరుగులు తీస్తునే ఉంటారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.