Mega 157

Mega 157: మెగా స్పీడులో మెగా 157.. హై వోల్టేజ్ షూట్ కంప్లీట్!

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం మెగా 157 శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతి 2026 లక్ష్యంగా ఈ సినిమా షూటింగ్ జోరందుకుంది. తాజాగా, ముస్సోరిలో రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవిపై హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అందాల తార నయనతార కూడా ఈ షూట్‌లో పాల్గొన్నారు.

అనిల్ రావిపూడి తన విలక్షణ శైలితో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చిరంజీవి కూడా సినిమాను త్వరగా పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెగా 157 భారీ అంచనాల నడుమ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో సింగిల్.. కీరవాణికి పవర్ స్టార్ హృదయపూర్వక సత్కారం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *