Bharat Taxi App: నగరాల్లో ప్రయాణం అంటేనే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లాలన్నా, అత్యవసర పనుల మీద బయటకు రావాలన్నా ఓలా, ఉబర్ లాంటి యాప్స్‌పై ఆధారపడక తప్పడం లేదు. అయితే, డిమాండ్‌ను బట్టి ఈ కంపెనీలు వసూలు చేసే ‘సర్జ్ ప్రైసింగ్’ (అదనపు ఛార్జీలు) కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి. మరోవైపు భారీ కమిషన్ల వల్ల డ్రైవర్లకు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) అనే సరికొత్త యాప్‌ను తీసుకువస్తోంది.
న్యూ ఇయర్ గిఫ్ట్.. ఢిల్లీ నుంచి శ్రీకారం
కొత్త ఏడాది కానుకగా జనవరి 1వ తేదీ నుంచి ఈ భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రూపొందిన ఈ ప్రాజెక్టును తొలుత దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభిస్తారు. అక్కడ విజయవంతం అయిన తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రావెల్ బ్యాన్.. ఆ దేశాల ప్రజలకు ఇక నో ఎంట్రీ! ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం.
భారత్ టాక్సీ ప్రత్యేకతలు ఇవే:
ఈ యాప్ కేవలం వినియోగదారులకే కాకుండా, వాహనదారులకు కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చనుంది:
-
స్థిరమైన ధరలు: ప్రైవేట్ యాప్‌ల మాదిరిగా రద్దీ సమయాల్లో ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా, పారదర్శకమైన ధరల విధానాన్ని ఈ యాప్ అనుసరిస్తుంది.
-
డ్రైవర్లకు పెద్ద పీట: సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు భారీగా కమిషన్లు కట్ చేసుకుంటాయి. కానీ, భారత్ టాక్సీలో ప్రయాణికుడు చెల్లించే మొత్తంలో 80 శాతానికి పైగా ఆదాయం నేరుగా డ్రైవర్‌కే అందుతుంది.
-
అన్ని రకాల వాహనాలు: ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా ఆటోలు, బైక్‌లు, మరియు కార్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
-
భారీ స్పందన: ఈ యాప్‌పై డ్రైవర్లలో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. యాప్ ప్రారంభానికి ముందే ఢిల్లీలో సుమారు 56,000 మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం.
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ, సామాన్యుడికి చౌకైన ప్రయాణాన్ని అందించడమే ‘భారత్ టాక్సీ’ ప్రధాన ఉద్దేశం. పారదర్శకమైన ధరలు, డ్రైవర్లకు మెరుగైన ఆదాయం అనే అంశాలు ఈ యాప్‌ను సక్సెస్ పథంలో నడిపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
भारत की सड़कों पर… भरोसा सिर्फ़ एक ही ऐप पर—Bharat Taxi!
1 LAKH+ सारथियों की मुस्कान, कमाई और सुरक्षा का नया साथी।
आज ही जुड़ें और अपने सफ़र को आसान, सुरक्षित और फायदेमंद बनाइए।👉 Bharat Taxi ऐप डाउनलोड करें — और बतौर सारथि अपनी कमाई व सम्मान को नया रास्ता दें!#BharatTaxi… pic.twitter.com/UGJtwCj87K
— @BharatTaxi (@coopbharattaxi) December 16, 2025
