Donald Trump: అమెరికాలో నివసిస్తున్న జనాలకి లేదా కోతగా వెళ్లాలనుకునే వారికి ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తూ వైట్ హౌస్ కొత్త రూల్స్ తెచ్చింది.
ఎందుకు ఈ నిర్ణయం?
థాంక్స్ గివింగ్ సెలవుల సమయంలో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నవంబర్ 26న జరిగిన ఈ దాడిలో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యురాలు సారా బెక్ స్ట్రోమ్ (20) ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Vikarabad: వికారాబాద్లో దారుణం.. సర్పంచ్ అభ్యర్థిపై కత్తుల దాడి!
ఈ ఘటనకు బాధ్యుడైన లకాన్వాల్ అనే ఆఫ్ఘన్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 2021లో ‘ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్’ కింద అమెరికాకు చేరుకున్నాడని, గతంలో ఆఫ్ఘన్ ఆర్మీలో పని చేసిన అనుభవం ఉందని తేలింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ట్రంప్ సర్కార్ వలస విధానాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
నిషేధించిన దేశాల జాబితా ఇక్కడ చూడండి:పూర్తిగా నిషేధం ఉన్న దేశాలు: గతంలో ఉన్న దేశాలతో పాటు ఇప్పుడు కొత్తగా వీరికి కూడా ప్రవేశం లేదు:
- సిరియా
- మాలి
- నైజర్
- బుర్కినా ఫాసో
- దక్షిణ సూడాన్
- పాలస్తీనా పత్రాలు ఉన్నవారు
ఆంక్షలు ఉన్న మరికొన్ని దేశాలు (పాక్షికంగా): నైజీరియా, టాంజానియా, అంగోలా, సెనెగల్, జాంబియా వంటి మరో 15 దేశాల ప్రజల పైన కఠినమైన నిబంధనలు పెట్టారు.దీనివల్ల ఏం జరుగుతుంది?
- వీసాలు దొరకవు:పైన చెప్పిన దేశాల వారికి అమెరికా వీసాలు రావడం చాలా కష్టం అవుతుంది.
- కఠిన తనిఖీలు:విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే, వారి బ్యాగ్రౌండ్ మొత్తం పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.
- అక్రమ వలసలకు అడ్డుకట్ట:దొడ్డి దారిన అమెరికాలోకి వచ్చేవారిని అరికట్టడానికి సరిహద్దుల దగ్గర నిఘా పెంచారు.
మొత్తానికి, అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇకపై నిబంధనలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి.
