Bhagyashri Borse

Bhagyashri Borse: డైలామాలో భాగ్యశ్రీ.. ఆ సినిమాపైనే భారీ ఆశలు!

Bhagyashri Borse:  టాలీవుడ్‌లో త్వరగానే తనదైన ముద్ర వేసుకున్న భాగ్యశ్రీ బొర్సేకు ‘కాంత’ సినిమా ద్వారా వచ్చిన ప్రశంసలు బాగా ఉత్సాహం కలిగించాయి. ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ చిత్రంలో నటిస్తున్న ఆమె ఈ రూరల్ డ్రామాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు కొత్త ఊపిరి పోస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

Also Read: Bhagavantudu Teaser: ఆకట్టుకుంటున్న భగవంతుడు టీజర్!

‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బొర్సే తన గ్లామర్, నటనతో త్వరగానే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’, ‘కాంత’, ‘కింగ్డమ్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది. ముఖ్యంగా కాంత సినిమాలో నట విశ్వరూపం చూపించింది. అయితే అందం, అభినయం ఉన్నా కానీ ఇప్పటిదాకా ఒక్క హిట్టు దక్కలేదు. ప్రస్తుతం అఖిల్ సరసన ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రంపైనే ఆమె అన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు బలమైన బూస్ట్ ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *