Prabhas: ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. భాగ్యశ్రీకి మాత్రం మంచి గ్లామర్ బ్యూటీగా క్రేజ్ వచ్చింది. అందుకే ఆమెకు ప్రస్తుతం ఆఫర్ల విషయంలో మాత్రం ఢోకా లేకుండాపోయింది. ఆమె గ్లామర్ & లుక్స్ ఆమె ఆఫర్లను ఎఫెక్ట్ చేయకుండా చేశాయి.ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో రామ్ పోతినేని సినిమా, దుల్కర్ సల్మాన్ తో “కాంత”, విజయ్ దేవరకొండతో “కింగ్డమ్” సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.అయితే.. వీటన్నిటికీ మించి ఓ బిగ్ ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ చాన్స్ కొట్టేసింది ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా ఎనౌన్స్ అవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ లుక్ టెస్టులు జరుగుతున్నాయి.అందులో బాగా వినిపిస్తున్న పేరు “భాగ్యశ్రీ బోర్సే”. చాలామంది కొత్త హీరోయిన్లను లుక్ టెస్ట్ చేసినప్పటికీ.. భాగ్యశ్రీకి సెట్ అయినట్లు సదరు లుక్ మరెవరికీ సెట్ అవ్వలేదట. దాంతో ఆమెను కన్ఫర్మ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాడట ప్రశాంత్ వర్మ. ఇదే గనుక నిజమైతే.. భాగ్యశ్రీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా లాంగెస్ట్ కెరీర్ ను కొనసాగించడం కూడా ఖాయం.
