Nalgonda: నల్గొండ జిల్లా నక్రేకల్ మండలం అర్లగూడెం గ్రామంలో సోమవారం ఉదయం దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. తేనెటీగల గుంపు ఆకస్మికంగా ముగ్గురిపై దాడి చేయగా, ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు
ఈ ఘటనలో పిడుగు ప్రభాకర్ (57) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతనిని వెంటనే నక్రేకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ప్రభాకర్ మరణించాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ప్రాథమిక చికిత్స అనంతరం వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.