Bengaluru Stampede

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట.. కీలక సంస్కరణలకు సిద్ధమైన బీసీసీఐ!

Bengaluru Stampede: 2025 ఐపీఎల్ విషాదంతో ముగిసిందని చెప్పొచ్చు. 18 ఏళ్ల తర్వాత ఛాంపియన్ గా నిలిచిన ఆనందం ఆర్సీబీకి 18 గంటలు కూడా లేదు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాదానికి బాధ్యులైన వారిని శిక్షించినప్పటికీ, ఈ విషాదం జరగకుండా నిరోధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం, నిర్వాహకులు, ఫ్రాంచైజీలు, KSCA యొక్క బాధ్యతారాహిత్యం వల్ల ప్రాణనష్టం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి BCCI ఒక కీలక చర్యలు చేపడుతున్నట్ుల తెలుస్తోంది.

బెంగళూరులో జరిగిన విషాదం ఐపీఎల్ సృష్టికర్త అయిన బీసీసీఐని ప్రపంచ క్రికెట్ ముందు తల వంచేలా చేసింది. అందువల్ల, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఈ విషయంలో బీసీసీఐ త్వరలో కొత్త రూల్ ను తీసుకురానుందని ఆయన తెలిపారు. ‘‘ఇటువంటి విషాదాలు జరగకుండా నిరోధించడానికి బీసీసీఐ ఏదైనా చేయాలి. చేస్తుంది కూడా. అది RCB ప్రైవేట్ ఈవెంట్ అయినప్పటికీ..దేశంలో క్రికెట్ కు బాధ్యత వహించేది బీసీసీఐ మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని సైకియా అన్నారు.

ఇది కూడా చదవండి: Nikhil Sosale: RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోషల్ ఎవరు?

ఇప్పుడు బీసీసీఐ ఏం చేస్తుంది?
ఐపీఎల్ విజయోత్సవాల సమయంలో ఇటువంటి సంఘటనలను నివారించడానికి బీసీసీఐ ఒక వ్యవస్థను రూపొందిస్తుందని తెలుస్తోంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి త్వరలో చర్చిస్తామని బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు. టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆర్సీబీ సెలబ్రేషన్స్ పై ప్రశ్నలు సంధించాడు. ఇలాంటి రోడ్ షోలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Honey Trap: టీ కోసం ఇంటికి పిలిచి..బట్టలిప్పి టెంప్ట్ చేసి..హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *