Ujjain Mahakaleshwar Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మొబైల్‌లో రీళ్లు తయారు చేసి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భస్మ హారతి సమయంలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని ఆలయ నిర్వాహకులు నిషేధించారు.
మహాకాళ్ ఆలయ కమిటీ అడ్మినిస్ట్రేటర్, ఏడీఎం అనుకుల్ జైన్ అధికారులతో చర్చించి భస్మ హారతి సందర్భంగా భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధం విధించారు. ఆరతికి వెళ్లే ముందు, భక్తులు తమ మొబైల్‌ని బయట ఉన్న చెకింగ్ పాయింట్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిషేధం గురువారం నుంచే అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: Indian Army Record: ఇండియన్ ఆర్మీ ప్రపంచ రికార్డు.. ఏమిటంటే..
Ujjain Mahakaleshwar Temple: దేశం నలుమూలల నుండి భక్తులు శ్రీ మహాకాళేశ్వర ఆలయానికి దర్శనం కోసం వస్తుంటారు. భస్మ ఆరతి దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో బుకింగ్ చేసుకుంటారు.
జనవరి 23వ తేదీ గురువారం జరిగే భస్మ హారతి నుంచి మొబైల్ ఫోన్ల నిషేధ నిర్ణయం అమలులోకి వస్తుందని మహకాళ్ ఆలయ కమిటీ సెక్యూరిటీ ఓఎస్డీ జయంత్ రాథోడ్ చెప్పారు. ఆరతికి వెళ్లేముందు భక్తులు తమ మొబైల్ ఫోన్‌లను చెకింగ్ పాయింట్‌లో సెక్యూరిటీ గార్డులకు లేదా ఆలయ కమిటీ ఉద్యోగులకు సమర్పించాలి. భస్మ హారతి పూర్తయిన తర్వాత సంబంధిత భక్తుల మొబైల్ ఫోన్లు తిరిగి ఇస్తారు.