Balayya: తెలంగాణ ప్రభుత్వం దాదాపు దశాబ్దం తర్వాత గద్దర్ పేరిట సినిమా అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలతో పాటు ఆరు స్పెషల్ అవార్డులను వెల్లడించగా, నందమూరి బాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా బాలయ్య భావోద్వేగంతో స్పందించారు.
“ఎన్టీఆర్ శతజయంతి, ఆయన నట జీవనంలో 75 ఏళ్ల సువర్ణోత్సవం జరుగుతున్న ఈ పవిత్ర క్షణంలో ఈ అవార్డు రావడం నా అదృష్టం. నాన్నగారి ఆశీస్సులు, దైవ కృపగా భావిస్తున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జ్యూరీకి కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ గౌరవం సిద్ధించింది.
Also Read: Housefull 5: హౌస్‌ఫుల్ 5 కి సెన్సార్ దెబ్బ?
Balayya: మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటా” అని బాలకృష్ణ హృదయపూర్వకంగా తెలిపారు. ఈ అవార్డు బాలయ్య సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది. తెలుగు సినిమా అభిమానులు ఈ క్షణాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు.