Pawan-Bunny

Pawan-Bunny: అల్లు-మెగా కుటుంబాలను కలిపిన కొణిదెల మార్క్‌ శంకర్‌!

Pawan-Bunny: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సినిమా పరిశ్రమలోనూ మెగా-అల్లు కుటుంబాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడినప్పుడు, ఈ కుటుంబాల మధ్య దూరం మరోసారి బయటపడింది. ఏప్రిల్ 8న జరిగిన ఈ ఘటన తర్వాత చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్ సింగపూర్‌కి వెళ్లి మార్క్‌ను పరామర్శించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సందేశాలు పంపారు. ఆఖరి పవన్‌ రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్‌ జగన్‌ సహా.. వైసీపీలోని అనేక మంది లీడర్లు.. చిన్నారి మార్క్‌ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షించారు. కానీ ఒక్క అల్లు కుటుంబం నుంచి మాత్రం స్పందన రాలేదు. అల్లు కుటుంబం నిశ్శబ్దం… సోషల్ మీడియాలో ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాల గురించి మరిన్ని ఊహాగానాలను రేకెత్తించింది.

గతంలో 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం, పవన్ కల్యాణ్ జనసేన విజయంపై అభినందనలు చెప్పకపోవడం వివాదాస్పదమయ్యాయి. ఇక సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయినప్పుడు పవన్ స్పందించలేదు. ‘పుష్ప 2’ విజయంపై మెగా హీరోలు ఎవ్వరూ స్పందించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏప్రిల్ 14న పవన్ నివాసానికి వెళ్లి మార్క్‌ను పరామర్శించడం ఆశ్చర్యం కలిగించింది. స్నేహతో కలిసి గంటసేపు గడిపిన బన్నీ, మాటలతో కాకుండా చేతలతో సందేశం ఇచ్చాడు. ఈ సంఘటన సినీ, రాజకీయ అభిమానుల మధ్య చర్చలకు తెరలేపింది.

Also Read: YCP Fake on Amaravati: పదేళ్లుగా దాడి చేస్తూనే ఉన్న వైసీపీ!

Pawan-Bunny: సోషల్ మీడియా ఊహాగానాలను పక్కనపెడితే, పవన్‌-బన్నీల తాజా కలయిక విభేదాలు సమసిపోయే దిశగా వేసిన తొలి అడుగుగా కనిపిస్తోంది. మార్క్ శంకర్‌ కోలుకుంటున్న వేళ, అన్నా లెజినోవా తిరుమలలో తల వెంట్రుకలు సమర్పించుకోవడం, కుటుంబం హైదరాబాద్‌కి తిరిగొచ్చిన సంతోషం… ఈ భావోద్వేగ క్షణంలో అల్లు అర్జున్ పవన్‌ ఇంటికి రావడం… మెగా-అల్లు అభిమానుల హృదయాలను మళ్లీ ఒక్కటి చేసింది. మెగా-అల్లు అభిమానులు ఇప్పుడు.. మేమంతా ఒక్కటే అనే టోన్‌ వినిపిస్తుండటం గమనార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *