Pawan Angry on DSP

Pawan Angry on DSP: ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ.. ఒకే రోజు టార్గెట్‌!

Pawan Angry on DSP: తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై విరుచుకుపడుతున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పోలీస్ యూనిఫామ్ ధరించకుండా మిలటరీ యూనిఫామ్ ధరించడం ఏమిటి ? అంటూ మండిపడ్డారు. ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ ఏమీ తగ్గలేదనీ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని, దాన్ని తన ఘనతగా ఏఎస్పీ ప్రచారం చేసుకుంటున్నారనీ తప్పుబట్టారు. జిల్లా కలెక్టర్ వస్తే ప్రోటోకాల్ పాటించకుండా మిలటరీ డ్రెస్సుతో వెళ్తావా? అంటూ ప్రశ్నించారు. తాడిపత్రిలో ఏఎస్పీపై విధులు సరిగ్గా నిర్వహించడం లేదని ఏకంగా పదివేల సంతకాలతో పైఅధికారులకు లేక రాస్తానని కూడా అన్నారు జేసీ. గడిచిన ఐదేళ్లలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వల్లే పోలీస్‌ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందంటూ జేసీ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Also Read: Chandrababu Naidu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఇక కూటమి ప్రభుత్వంలోనైనా పోలీసు అధికారుల తీరు ఏమైనా మారిందా అంటే.. అనుమానమే. కొందరు అధికారుల వ్యవహారశైలే అందుకు కారణం. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీ జయసూర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం, సివిల్ వివాదాల్లో జోక్యం, కూటమి నేతల పేర్ల వాడుకుంటూ అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై పవన్ స్పందించారు. ఈ ఫిర్యాదులపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్‌, డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారట. అసాంఘిక కార్యకలాపాలకు అండగా ఉండటం, పక్షపాత ధోరణి చూపడం వంటి ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని సూచించారట డిప్యూటీ సీఎం. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా శాంతిభద్రతలను సమదృష్టితో పరిరక్షించాలని ఆదేశించారట. భీమవరంలో పేకాట శిబిరాలు పెరిగాయని, దీని వెనుక డీఎస్పీ జయసూర్య హస్తం ఉందని తమకు ఫిర్యాదులు వచ్చాయంటోంది జనసేన పార్టీ. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

జయసూర్య గతంలో గన్నవరం డీఎస్పీగా పనిచేసి, వైసీపీకి విధేయత చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. భీమవరంలో జనసేన ఎమ్మెల్యే అంజిబాబుతో సన్నిహితంగా ఉంటున్నట్లు కనిపిస్తూనే… అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదులపై సమాచారం సేకరించి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించదని స్పష్టం చేశారు. డీఎస్పీపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి సూచించారు. ఈ ఆరోపణలతో జయసూర్య బదిలీ ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *