Vemireddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ఇప్పుడు ఆ పొలిటికల్ కపుల్ బాగా ఫేమస్. భర్త లోక్‌సభ సభ్యుడు. భార్య శాసనసభ సభ్యురాలు. టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పదవి అదనం. రాజకీయ పదవులు, హోదాల్లోనే కాకుండా.. తమ పని తీరుతో కూడా ఆ జంట తమ విలక్షణతను నిలుపుకుంటున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం పబ్లిక్ ఇమేజ్ కోసం, పొలిటికల్ గుడ్ విల్ కోసం వందల కోట్లు రాజకీయాల్లో ఖర్చు పెట్టే జంటగా ప్రత్యేకమైన పాపులారిటీ వారిది. ఎన్నికల వరకూ బోలెడు డబ్బు ఖర్చు చేసేశాం…
ఇక రూపాయి కూడా ఖర్చు చేసేది లేదని, ఒట్టు వేసుకుని బ్యాంక్ అకౌంట్లను తెరవడం మానేస్తారు ఎన్నికల తర్వాత సాధారణంగా రాజకీయ నాయకులు. కానీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాత్రం ఎన్నికలు ముగిసి, బంపర్ మెజారిటితో గెలిచి, అధికారంలోకి వచ్చాక కూడా తమ సేవా కార్యక్రమలు కొనసాగిస్తున్నారు. చెప్పాలంటే ఇంకా ఉధృతం చేశారు. ప్రజ ప్రయోజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమలు, చర్చి, మసీదుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Vemireddy: నెల్లూరు లోక్‌సభ స్దానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వికలాంగులకు దాదాపుగా పది కోట్ల రూపాయల ఖర్చుతో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపీణీకి శ్రీకారం చుట్టారు వేమిరెడ్డి దంపతులు. పంపిణీ చేస్తోంది సాధారణ ట్రై సైకిల్స్ అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఒక్కోటి యాభై వేలకు పైగా విలువ చేసే అత్యాధునిక ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ కావడంతో, అది కూడా వేలాది మంది వికలాంగులకు పంపిణీ చేస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తన వీపీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా ఒక్కో నియోజకవర్గంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి.. దాదాపుగా రెండు కోట్ల ఖర్చుతో వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు. దాంతో పాటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశాలు పెట్టి.. రకరకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో పసందైన విందు భోజనం వడ్డిస్తుండటం చూసి.. జిల్లాలో కోటీశ్వర్లు అయిన రాజకీయ నేతలంతా ఆశ్చర్యపోతున్నారట.
Also Read: YS Jagan: ఓపిక పట్టలేకపోతున్న జగన్
ఎంపీ వేమిరెడ్డి అడుగుజాడల్లోనే ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా తనను ఆదరించిన కోవూరు ప్రజల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఇటీవల మహిళా దినోత్సవానికి వేలాది మంది మహిళలను పిలిచి సత్కరించి, భోజనం పెట్టి, గౌరవించడం గురించి… కోవూరులో నేటికీ మాట్లాడుకుంటూ ఉండటం విశేషం. రంజాన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గం మొత్తం మసీదులకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎయిర్ కూలర్స్ ఉచితంగా అందించారట ప్రశాంతి రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో గుడులు, బడులు బాగు చేసేందుకు నెలకు అర కోటికి పైగా ప్రశాంతి రెడ్డి ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు.
Vemireddy: ఇరిగేషన్ కాలువలు రిపేరు చేసి రైతులకు మేలు చేసేందుకు, పార్కులు, స్మశానాల కోసం, రోడ్ల రిపేర్ల కోసం ఇప్పటికే కోట్ల రూపాయల సొంత డబ్బును కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఖర్చు చేశారట. నిరుద్యోగ యువత కోసం తరచూ జాబ్ మేళాలు నిర్వహిస్తూ.. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీపీఆర్ కన్వెన్షన్ హాల్‌ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారట వేమిరెడ్డి కపుల్.
ఇలా వేమిరెడ్డి దంపతులు ఆఫ్టర్ ఎలక్షన్స్ చేస్తున్న సేవ.. రాజకీయాల్లో చాలా రేర్ అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు జిల్లాలో వేల కోట్లున్న పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులకు కొదవే లేదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలా ఎన్నికలు, రాజకీయాలతో పని లేకుండా… గుడ్ విల్ కోసం, ప్రజల్లో గుడ్ ఇమేజ్ కోసం… ఇంత భారీగా సొంత ధనాన్ని ఖర్చు చేసే ధైర్యం, తెగువ, తెంపు ఉన్న లీడర్స్, పారిశ్రామికవేత్తలు ఎవరు లేరని చాలెంజ్ చేస్తున్నారు వీపీఆర్ ఫ్యాన్స్.