Kommineni Questions: కమ్మరావతి అంటూ ఏడవడం అయిపోయింది. భ్రమరావతి అంటూ బురద జల్లడం అయిపోయింది. స్మశానం అంటూ పేలడం అయిపోయింది. ఇప్పుడు వేశ్యల రాజధానట. అమరావతిపై నరనరాన ఎక్కించుకున్న ద్వేష భావం కాదా ఇది?
– మూడు రాజధానులు అన్న మాయలోడిని మూడు ప్రాంతాల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టారు. అయినా ఇంకా బుద్ధి రాలేదా? ఏంటీ మాటలు? పైగా శాలువాలు కప్పమని, సన్మానం చేయమని నిస్సిగ్గుగా అడుగుతారా?
– మాటకు ముందొకసారి, మాటకు వెనకొకసారి.. నా అక్కచెల్లెమ్మలు అనే పెద్దమనిషి.. నిజ స్వరూపం ఇదా? మహిళల పట్ల ఇంత చిన్న చూపా? ఇంత అహంకారం, ఇంత బలుపా? రాజకీయ దుష్టత్వానికి, భ్రష్టత్వానికి ఇది పరాకాష్ట కాదా?
– ‘వేశ్యల రాజధాని’ అన్న ఆలోచన మాట్లాడిన కృష్ణంరాజుదా? మాట్లాడించిన కొమ్మినేనిదా? ఛానల్ అధిపతి భారతి రెడ్డిదా? వైసీపీ అధినేత జగన్ రెడ్డిదా?
– భారతి, జగన్ ఇంకా ఎందుకు నోరు విప్పలేదు? అసలు చంద్రబాబు ‘దేవతల రాజధాని’ అన్నందుకు మీకొచ్చిన నొప్పేంటి? వేశ్యల రాజధాని అంటూ మాట్లాడించింది మీరే అని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే మీరు సృష్టించిన వేదిక నుంచీ ఈ కీచక పర్వం నడిచింది. ఖండించడానికి మీకు మనసు రావట్లేదా? మీ ఆదేశానుసారమే కొమ్మినేని క్షమాపణ చెప్పడానికి కూడా జంకారా?
– టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్‌లో అమరావతి పేరైనా ఉందా కనీసం? అమరావతి చుట్టూ ఉన్నది దళితులే అనడానికి ఆధారాలున్నాయి. జనాభా లెక్కలున్నాయి. మరి అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లే ఉన్నారనటానికి మీ దగ్గర శాస్త్రీయమైన ఆధారాలున్నాయా? సిగ్గు లేకుండా సమర్థించుకుంటారా?
Also Read: No Credibility Serve: ఈ ప్రయోజనం లేని సర్వేల అసలు ఉద్దేశం ఏమిటి?
– పోనీ సెక్స్ వర్కర్లు లేని రాజధాని దేశంలో ఒక్కటైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? సెక్స్ వర్కర్లు ఉన్నారని రాజధానిని బహిష్కరిద్దామా? సెక్స్ వర్కర్లనే రాజధాని నుండి బహిష్కరించాలని మీ ఉద్దేశమా? సెక్స్ వర్కర్లు కూడా మహిళలే, మన లాంటి మనుషులే అని మీ బుర్రలకు అర్థం కాదా?
– మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చూసినా.. కర్నూలు, కడప, అనంతపూర్… సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న టాప్ 4 జిల్లాల్లో మూడు రాయలసీమ జిల్లాలే. అలాగని మన రాయలసీమను కించపరుచుకుందామా? అసలు ఒక ప్రాంత మహిళలపై వేశ్యలు అనే ముద్ర ఎలా వేస్తారు? మీరు మనుషులేనా?
– జరిగిన అవమానం రాజధాని ప్రాంత మహిళలకైతే, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకైతే… మీరు క్షమాపణ చెప్పేది మీ యజమాని భారతి రెడ్డికా? ఇదెక్కడి లాజిక్కు కొమ్మినేని గారు?
– మీ లైవ్ షోలో లక్ష్మీపార్వతిని ఎవరో కాలర్ ఏదో అంటే.. మీకు కోపమెందుకు వచ్చింది? మీ కళ్లెదురుగా కూర్చుని అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడితే మీకు లైవ్ డిబేట్‌లోనే నవ్వెందుకొచ్చింది?
– ‘నా నోటి నుండి ఆ మాట రాలేదు’ అని సమర్థించుకుంటున్నారు. అంటే మీ చానల్‌లో కూర్చుని ఎవరు ఏం మాట్లాడినా మీకు, మీ చానల్ యజమానికి సంబంధం లేదని చేతులు దులుపుకుంటారా? మీ పాత్రికేయ విలువలు ఇంతేనా? 40 ఏళ్ల పాత్రికేయంలో మీరు నేర్చుకున్నది ఇదేనా?