Kadapa: సోషల్ మీడియా లో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో తన పై నమోదైన కేసులో భాగంగా మొదటిసారి విచారణకు వచ్చారు. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ రాఘవ రెడ్డి.గత నెలలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రా రవీంద్ర రెడ్డి పై పులివెందుల లో పలు కేసులు నమోదు అయ్యాయి.వర్రా రవీంద్ర రెడ్డి కి రాఘవ రెడ్డి కంటెంట్ ఇచ్చేవారని వర్రా రవీంద్ర రెడ్డి వాంగ్మూలం మేరకు రాఘవ రెడ్డి కేసు నమోదైంది.వర్రా అరెస్టు తర్వాత రాఘవ రెడ్డి గత నెల 11 తేదీ నుంచి అజ్ఞాతంలో ఉన్నారు.ఇటీవల తనపై 12 తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు యాంటీసీపాట్రీ బెయిల్ ద్వారా ఆర్డర్ తెచ్చుకొన్న రాఘవ రెడ్డి నిన్న తమ ఇంటికి రావడంతో పోలీసులు మరోసారి రాఘవ రెడ్డి ఇంటికి వెళ్ళి నోటీసులు అందించారు.పోలీసుల నోటీసుల మేరకు నేడు కడప సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు విచారణకు వచ్చారు రాఘవ రెడ్డి..సైబర్ క్రైమ్ డిఎస్పీ ఆద్వర్యంలో నేడు విచారణ కొనసాగుతుంది.
![Kadapa](https://mahaanews.co.in/wp-content/uploads/2024/12/Kadapa-2.jpg)