Siddipet: గత నాలుగు రోజుల క్రితం చేర్యాల మండలం వేచరేణి గ్రామ శివారులోని హనుమాన్ విగ్రహం,గ్రామ దేవతల గుడులను గ్రామానికి చెందిన దళిత యువకుడు ధ్వంసం చేయడంతో యువకుడిని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…దళిత యువకుడిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు..
దీంతో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య ఎల్లదాస్ నగర్ కాలనీలో పర్యటించి బాధిత యువకుడి కుటుంబాన్ని పరామర్శించి,కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు…ఈ సందర్భంగా కమీషన్ చైర్మెన్ మాట్లాడుతూ.. గ్రామంలోని గుడులను ధ్వంసం చేశాడని కారణంతో దళిత యువకుడిపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని,యువకుడు తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష పడేలా చూడాలి తప్ప చట్టాన్ని చేతులోకి తీసుకొని యువకుడిని ఊరేగిస్తూ చితకబాదడం సరైనది కాదని అన్నారు..
దళిత యువకుడిపై దాడి చేసిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని,గ్రామస్థులు ఎలాంటి భయదోళనకు గురి కావద్దని గ్రామస్తులకు ఎస్సీ,ఎస్టీ కమీషన్ తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు.