Asian Development Bank

Asian Development Bank: ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కేంద్రానికి భారీ రుణం

Asian Development Bank: భారతదేశంలో గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ రూ.4,250 కోట్ల రుణాన్ని ఆమోదించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకు మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా, దేశ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రూ.2,940 కోట్ల రుణం అందించేందుకు బ్యాంకు గతవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంలో, మరొక రుణ ఒప్పందం పై కూడా సంతకాలు  జరిగాయి. 

ఇది కూడా చదవండి: Snake: కోర్టులో బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము.. చివరికి ఏమైందంటే.

Asian Development Bank: ఈ రుణ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ’, ఐఐఎఫ్‌సిఎల్‌కు ఇవ్వనుంది. రవాణా, ప్రత్యామ్నాయ ఇంధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఏజెన్సీ దీర్ఘకాలిక మూలధన మద్దతును అందిస్తుంది. ఇది పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్య ప్రాజెక్టులకు కూడా నిధులు సమకూరుస్తుంది.2070 నాటికి ‘జీరో ఎమిషన్’ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి ప్రైవేట్ మూలధనం చాలా అవసరమని రిపోర్ట్స్ వచ్చాయి. IIFCL దానిని సమీకరించడంలో ఎక్స్ పార్ట్ గా చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *