Arya 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ ఏంటో పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీకి తెలిసిందే.ఇక ఈ రానున్న ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుండగా ఈసారి తన పుట్టినరోజుకి అభిమానులు ఆర్య 2ని రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.
Also Read: Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ కేసు ముగిసినట్టే.. క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసిన CBI
అయితే ఆర్య 2 సినిమాని అన్నీ సినిమాల్లా కాకుండా.. ఏ సినిమాకి జరగని కొత్త ప్లానింగ్ తో రీరిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.ఆర్య 2 చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజమైతే బన్నీ రీ రిలీజ్ లో రికార్డ్స్ సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు. మరి ఆర్య 2 రీరిలీజ్ రికార్డులని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.
