Ap news: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆక్యుపెన్సీ రేట్ పెంచుకోడానికి ఏపీఎస్‌ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పోటీతో పాటు ఇతర కారణాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సగానికి సగం ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో దానిని పెంచుకోడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళే బసుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి భారీ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.
ఏసీ బస్సుల్లో వచ్చే నెల 1 నుంచి 10, 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, బెంగుళూరు సహా ఇతర మార్గాల్లో రాను, పోను టిక్కెట్లు ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల్లో చార్జీల్లో 10 శాతం రాయితీ సౌకర్యం ఇస్తున్నా మని అధికారులు పేర్కొన్నారు.విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ మధ్య 10 శాతం రాయితీతో ఛార్జీ రూ. 700 వసూలు చేస్తారు. ఈ రూట్‌లో సాధారణ ఛార్జీ రూ.770, కూకట్‌పల్లి, ఇతర ప్రాంతాలకు 10 శాతం రాయితీతో రూ. 750 వసూలు చేస్తారు.
ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ. 830 ఉంది.20 శాతం రాయితీతో రూ.1770గా నిర్ణయించారు. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ. 2170 ఉంటుంది. అమరావతి మల్టీయాక్సిల్ ఛార్జీ రూ. 1530కు తగ్గించారు. ఇందులో సాధారణ ఛార్జీ రూ.1870గా ఉంది. ప్రయాణికులు ఈ సౌలభంగా వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.