AP Elections

AP Elections: ఏపీ స్థానిక సమరంలో కూటమి ప్రభంజనం..!

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మద్దతుదారులు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. గురువారం (నవంబర్ 26, 2026) రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో మొత్తం 3,189 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, మూడింట రెండొంతుల స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో కూటమి మద్దతుదారులు 1,835 పంచాయతీల్లో విజయం సాధించగా, ఇందులో టీడీపీ 1,661, జనసేన 150, బీజేపీ 24 స్థానాల్లో పాగా వేశాయి. ప్రతిపక్ష వైసీపీ మద్దతుదారులు 906 పంచాయతీల్లో, ఇతరులు 113 చోట్ల గెలుపొందారు. అంతకుముందు ఏకగ్రీవమైన 708 పంచాయతీలను కూడా కలుపుకుంటే.. మొత్తం మీద టీడీపీ 2,325, వైసీపీ 1,107, జనసేన 189, బీజేపీ 25, ఇతరులు 294 పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

ముఖ్యంగా 10 వేల కంటే ఎక్కువ ఓటర్లున్న 52 మేజర్ పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు 28 స్థానాల్లో (టీడీపీ 25, జనసేన 3) గెలిచి సత్తా చాటగా, వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ  గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనూ ఆ పార్టీకి చుక్కెదురైంది.

మేజర్ పంచాయతీల ఫలితాలు (10,000+ ఓటర్లు ఉన్న ముఖ్య స్థానాలు)

జిల్లా మేజర్ పంచాయతీ విజేత (పార్టీ మద్దతు) సమీప ప్రత్యర్థి మెజారిటీ
శ్రీకాకుళం సోంపేట టీడీపీ  వైసీపీ  1,126
విజయనగరం కొత్తవలస టీడీపీ  వైసీపీ  2,147
విజయనగరం శృంగవరపుకోట టీడీపీ  వైసీపీ  908
తూర్పుగోదావరి కడియం టీడీపీ  వైసీపీ  1,002
తూర్పుగోదావరి చాగల్లు టీడీపీ  టీడీపీ  రెబల్ 981
తూర్పుగోదావరి కోలమూరు టీడీపీ  జనసేన 2,462
తూర్పుగోదావరి కడియపులంక జనసేన రెబల్ జనసేన 3,933
కోనసీమ పల్లంకుర్రు టీడీపీ  వైసీపీ  1,591
కోనసీమ రాజోలు టీడీపీ  వైసీపీ  1,000 (ఆధిక్యం)
ఏలూరు పరింపూడి జనసేన రెబల్ జనసేన 2,851
పశ్చిమగోదావరి వాసవీ పెనుగొండ టీడీపీ  వైసీపీ  1,672
కృష్ణా గన్నవరం టీడీపీ  వైసీపీ  1,042
కృష్ణా బాపులపాడు జనసేన టీడీపీ  2,986
ఎన్టీఆర్ నిడమానూరు టీడీపీ  వైసీపీ  2,762
ఎన్టీఆర్ ప్రసాదంపాడు టీడీపీ  వైసీపీ  6,022
ఎన్టీఆర్ నున్న వైసీపీ  టీడీపీ  1,639
ఎన్టీఆర్ మైలవరం టీడీపీ  వైసీపీ  4,625
ఎన్టీఆర్ గుంటుపల్లి టీడీపీ  వైసీపీ  2,462
బాపట్ల మార్టూరు టీడీపీ  వైసీపీ  74
బాపట్ల ఇంకొల్లు టీడీపీ  స్వతంత్ర 2,238
ప్రకాశం టంగుటూరు టీడీపీ  టీడీపీ  రెబల్ 2,043
ప్రకాశం సింగరాయకొండ వైసీపీ  టీడీపీ  970
నెల్లూరు వింజమూరు వైసీపీ  టీడీపీ  2,607
తిరుపతి రేణిగుంట టీడీపీ  వైసీపీ  3,870
తిరుపతి కరకంబాడి టీడీపీ  వైసీపీ  300 (ఆధిక్యం)
చిత్తూరు వి.కోట టీడీపీ  వైసీపీ  1,020
కడప పోరుమామిళ్ల టీడీపీ  వైసీపీ  4,321
శ్రీసత్యసాయి ముదిగుబ్బ టీడీపీ  వైసీపీ  191
అనంతపురం కణేకల్లు వైసీపీ  టీడీపీ  415
అనంతపురం రుద్రంపేట టీడీపీ  వైసీపీ  1,106
అనంతపురం కంబదూరు టీడీపీ  వైసీపీ  842
అనంతపురం కక్కలపల్లి కాలనీ వైసీపీ  టీడీపీ  1,210
నంద్యాల శిరివెళ్ల టీడీపీ  వైసీపీ  9,630
నంద్యాల చాగలమర్రి టీడీపీ  వైసీపీ  10,064
కర్నూలు హొళగొంద టీడీపీ  టీడీపీ  రెబల్ 1,002
కర్నూలు ఆలూరు వైసీపీ  టీడీపీ  127

తొలిదశ గ్రామ పంచాయతీల్లో జిల్లాల వారీగా పోలింగ్ శాతం (మొత్తం: 77.65%)

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు భారీ ఎత్తున తరలిరావడంతో సగటున 77.65 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 83.37% పోలింగ్ నమోదు కాగా, వైఎస్సార్ కడప జిల్లాలో అత్యల్పంగా 57.87% పోలింగ్ నమోదైంది.

  • అత్యధిక పోలింగ్ జిల్లాలు: చిత్తూరు (83.37%), విజయనగరం (83.33%), నంద్యాల (82.68%), శ్రీసత్యసాయి (82.05%), మార్కాపురం (81.70%), అనకాపల్లి (81.59%), అనంతపురం (81.23%), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (80.60%), పల్నాడు (80.52%), ప్రకాశం (80.27%), ఏలూరు (80.23%).
  • ఇతర జిల్లాలు: బాపట్ల (79.84%), కృష్ణా (79.77%), కాకినాడ (78.79%), పార్వతీపురం మన్యం (78.78%), అన్నమయ్య (78.66%), తూర్పు గోదావరి (78.47%), కర్నూలు (76.60%), పశ్చిమ గోదావరి (76.42%), ఎన్టీఆర్ (75.83%), తిరుపతి (73.60%), అంబేడ్కర్ కోనసీమ (72.60%), పోలవరం (71.21%), శ్రీకాకుళం (66.93%), అల్లూరి సీతారామరాజు (58.85%), వైఎస్సార్ కడప (57.87%).

మలివిడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వివరాలు

మరోవైపు గురువారం జరిగిన మలివిడత పట్టణ స్థానిక సంస్థల (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) ఎన్నికల్లో మార్కాపురం జిల్లా పొదిలిలో అత్యధికంగా 77.40% పోలింగ్ నమోదు కాగా, శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అత్యల్పంగా 54.60% పోలింగ్ నమోదైంది.

 

జిల్లా పట్టణ స్థానిక సంస్థ మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
మార్కాపురం పొదిలి 29,697 22,986 77.40%
ప్రకాశం కందుకూరు 47,473 36,113 76.07%
శ్రీకాకుళం ఆమదాలవలస 33,067 24,858 75.17%
గుంటూరు మంగళగిరి-తాడేపల్లి 2,37,712 1,76,531 74.26%
అన్నమయ్య బి.కొత్తకోట 23,368 16,431 70.31%
పశ్చిమగోదావరి పాలకొల్లు 77,478 53,779 69.41%
బాపట్ల బాపట్ల 74,809 51,799 69.24%
పల్నాడు నరసరావుపేట 1,07,622 74,453 69.18%
గుంటూరు పొన్నూరు 60,200 40,858 67.87%
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కావలి 85,433 57,071 66.80%
తిరుపతి శ్రీకాళహస్తి 72,684 48,374 66.55%
ఏలూరు చింతలపూడి 22,738 15,012 66.02%
విజయనగరం రాజాం 36,787 24,022 65.30%
కృష్ణా గుడివాడ 1,19,594 77,533 64.83%
పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెం 1,00,728 65,202 64.73%
పశ్చిమగోదావరి తణుకు 75,465 48,202 63.87%
పశ్చిమగోదావరి భీమవరం 1,45,738 91,260 62.62%
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అల్లూరు 21,833 13,249 60.68%
కాకినాడ కాకినాడ 2,85,950 1,67,402 58.54%
తూర్పుగోదావరి రాజమహేంద్రవరం 4,63,323 2,62,110 56.57%
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గూడూరు 80,492 45,400 56.40%
కృష్ణా తాడిగడప 1,38,576 78,054 56.33%
శ్రీకాకుళం శ్రీకాకుళం 1,57,545 86,017 54.60%

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *