Chandrababu: తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని తెలిసినప్పటికీ ఏర్పాట్లలో అలసత్వం వహించారంటూ ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ముందుగా సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
నిజానికి వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులకు టోకెన్లను జరీ చేసే ప్రక్రియ ఉంటుందని టీటీడీ చాలా ముందుగానే ప్రచారం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, ఉత్త్రర భారత దేశ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. కౌంటర్లు తెరిచే సమయానికే తిరుపతి మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సంకేతాలు చాలా ముందుగానే కనిపించాయి. ఇటువంటప్పుడు తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లిప్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత ఇతర అధికారులు ఎందుకు అలసత్వం వహించారు అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Punjab Serial Killer Arrest: భార్య చెపింది.. ఉద్యోగం మానేసి.. సెక్స్ వర్కర్‌గా మారిన భర్త
Chandrababu: విశాఖపట్నంలో ఏపీ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా అంతా మంచే జరిగిందని సంతోషపడాల్సిన సమయంలో భక్తుల మృతి తనను కలచివేసిందని చంద్రబాబు చెప్పారు. ఇది తీవ్ర ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఘటనకు కారణమని.. అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని సీఎం అన్నారు.
ప్రస్తుతం గాయాలపాలైన వారికీ అందుతున్న ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. టీటీడీ ఈవో, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్సాపీలతో తొక్కిసలాట ఘటనపై రివ్యూ చేయననున్నటు చెప్పిన సీఎం చంద్రబాబు, రివ్యూ అనంతరం తిరుపతికి వెళ్లి, క్షతగాత్రులను పరామర్శించాలని నిర్ణయించారు. ఈరోజు (గురువారం) అయన తిరుపతి వెళ్లనున్నారు. భక్తులు అధికంగా వస్తారని తిలిసినప్పటికీ ఏర్పాట్లు చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పిన చంద్రబాబు ఇలాంటి పరిస్థితుల్లో విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా? అంటూ అధికారులను ప్రశించారు. మృతుల సంఖ్య పెరగడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను మళ్ళీ సమీక్షించి.. పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.