Annapurna Studios

Annapurna Studios: 50 ఏండ్లు పూర్తి చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్.. నాగార్జున స్పెష‌ల్ వీడియో

Annapurna Studios: ఇటీవల లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ముగింపు ఉత్సవాలను జాతీయ స్థాయిలో జరుపుకున్నారు. విశేషం ఏమంటే… సరిగ్గా యాభై యేళ్ళ క్రితం అక్కినేని చేతుల మీదుగా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, అక్కినేని నాగార్జున ఓ వీడియోను విడుదల చేశారు. అన్నపూర్ణస్టూడియోస్ లో తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలనూ చూపిస్తూ, అందులోని ఎంప్లాయిస్ భావాలను తెలియచేస్తూ ఈ వీడియో సాగింది. సంక్రాంతి రోజునే యాభై యేళ్ళ క్రితం అన్నపూర్ట స్టూడియోస్ ప్రారంభమైందని ఈ వీడియోను ప్రారంభించిన నాగార్జున… అక్కినేని శిలావిగ్రహం దగ్గర ఆయనకు నివాళులు అర్పిస్తూ దీనిని పూర్తి చేశారు. ఇవాళ వరల్డ్ వైడ్ టెక్నాలజీకి అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టింది పేరుగా నిలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *