Andhra King Taluka

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ తాలూకా: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఉపేంద్ర రోల్!

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆంధ్రా కింగ్ తాలూకా”. ఈ సినిమా బయోపిక్ టచ్‌తో ప్రేక్షకులను అలరించనుంది. రామ్‌ ఈ చిత్రంలో స్టార్ హీరో ఉపేంద్రకు అభిమానిగా కనిపించనున్నాడు. ఉపేంద్ర పాత్ర చుట్టూ రాసిన ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని సమాచారం. ముఖ్యంగా, స్టార్‌డమ్ కోల్పోయిన సమయంలో ఉపేంద్ర ఎదుర్కొన్న సవాళ్లను చూపించే సీన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తాయని టాక్. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందని నమ్మకం. సంగీత ద్వయం వివేక్-మెర్విన్ ఈ సినికి బాణీలు సమకూర్చగా, మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్‌ ఎనర్జీ, ఉపేంద్ర ఎమోషన్స్ కలయికతో “ఆంధ్రా కింగ్ తాలూకా” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ayush Shinde: చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *