Naveen Polishetty: డిసెంబర్ 26న నవీన్ పోలిశెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ టీజర్ ను విడుదల చేశారు. ఈ యేడాది అంతా ప్రజలు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి గురించి మాట్లాడుకున్నారని, వచ్చే యేడాది రాజుగాడి పెళ్లి గురించి మాట్లాడుకుంటారంటూ నవీన్ పోలిశెట్టి తెలిపాడు. రాజు పెళ్ళి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే యేడాది జనం ముందుకు రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ప్రారంభమై… పూర్తి అయ్యేసరికీ స్టార్ కాస్ట్ తో పాటు టెక్నీషియన్స్ విషయంలోనూ చాలానే మార్పులు జరిగాయి. హీరోయిన్ గా మొదట శ్రీలీల పేరు వినిపించగా ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది. అలానే సంగీత దర్శకుడు తమన్ ప్లేస్ లోకి మిక్కీ జే మేయర్ వచ్చాడు. దర్శకుడిగా తొలుత కళ్యాణ్ శంకర్ పేరు ప్రకటించారు. ఇప్పుడు మారి దీనికి డైరెక్టర్. ఈ మార్పులు చేర్పులను పక్కనపెడితే… నవీన్ పొలిశెట్టి మరోసారి తనదైన వినోదాన్ని అందిస్తాడని అర్థమౌతోంది.