Pushpa 2: ఎట్టకేలకు ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మంగళవారంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఐదేళ్ళ ‘పుష్ప’ ప్రయాణం అమేజింగ్ అంటూ బన్నీ వ్యాఖ్యానించాడు. మోస్ట్ అవైటింగ్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ‘పుష్ప-2’ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్ కు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ‘పుష్ప -3’ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సో… నిజానికి ‘పుష్ప-2’ షూటింగ్ ముగిసినా… పుష్పరాజ్ ప్రయాణం మాత్రం ఇంకా మిగిలే ఉందనుకోవాలి.