Welcome to the Jungle

Welcome to the Jungle: వెల్కమ్ టూ ది జంగిల్: నిర్మాతలకు అక్షయ్ చుక్కలు?

Welcome to the Jungle: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరో భారీ మల్టీస్టారర్ చిత్రం ‘వెల్కమ్ టూ ది జంగిల్’తో రానున్నాడు. వెల్కమ్ ఫ్రాంచైజీలో మూడో చిత్రమైన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం అక్షయ్ ప్రతిపాదించిన లాభాల విభజనలో వివాదమని సమాచారం. సినిమా లాభాల్లో 80% తనకు, 20% నిర్మాతలు, ఇతరులకు అని అక్షయ్ సూచించడంతో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్, అధిక రెమ్యునరేషన్‌తో పాటు తక్కువ లాభాల వాటాతో నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తైనా, మిగిలిన 30% ఇంకా పెండింగ్‌లో ఉంది. అక్షయ్, నిర్మాతల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది? ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుంది? లాభాల వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mouni Roy: బీచ్‌లో స్టన్నింగ్ బికినీ లుక్‌తో సెగలు రేపుతున్న మౌని రాయ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *