Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “అఖండ 2 తాండవం” సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. బోయపాటి గత చిత్రాలైన జయ జానకి నాయకలో హంసల దీవి యాక్షన్, వినయ విధేయ రామలో షర్ట్‌లెస్ ఫైట్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు అఖండ 2లోనూ అదే స్థాయిలో మరో స్పెషల్ యాక్షన్ సీన్‌ను రూపొందిస్తున్నారు.
Also Read: Tollywood: సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్, ఉపాసన నుంచి ఊహించని కానుక
Akhanda 2: మంచు పర్వతాల నడుమ హెలికాప్టర్లు, ప్యాంజర్‌లు, ట్రక్‌లతో కూడిన భారీ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనుంది. బోయపాటి తనదైన మాస్ ఎలివేషన్స్, ఊహించని ట్విస్ట్‌లతో ఈ సీన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ సన్నివేశం పెద్ద తెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రం ఈ చిత్రం మరో విజయ గర్జనగా నిలిచే అవకాశం ఉంది.