Good Bad Ugly: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అజిత్ హీరోగా భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీనిని దర్శకుడు అధిక్ రవీచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఏడు రోజులు బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే దానిని పూర్తి చేస్తామని నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని తెలిపారు. ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నామని… అయితే ఇప్పుడు మరో తేదీకి వెళ్లబోతున్నామని అన్నారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అజిత్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా ఈ సినిమా ఉండబోతోందని నవీన్ ఎర్నేని చెప్పారు. అజిత్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ‘విడా ముయర్చి’ కూడా విడుదల కావాల్సి ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి ముందు ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది.