Youtuber Nandana: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ రమా నందనకు బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. యూకే (లండన్)లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన అద్దంకి పోలీసులు, సెప్టెంబర్ 17న వ్యక్తిగతంగా స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించారు.
అసలేం జరిగింది? – కేసు వివరాలు..
కేసు దర్యాప్తులో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు.సెప్టెంబర్ 17న ఆమె అద్దంకి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.విచారణలో ఆమె ఇచ్చే సమాధానాలు, సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు (అరెస్ట్ లేదా ఇతర ప్రక్రియలు) చేపట్టే అవకాశముంది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న ఒక యూట్యూబర్ ఇలాంటి జాబ్ ఫ్రాడ్ వివాదంలో చిక్కుకోవడం, పోలీసుల నుంచి నోటీసులు అందుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
