samantha

Samantha: నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha: కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సమంత ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఈ హాట్ బ్యూటీ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడిప్పుడే తన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కోలుకుంటూ మళ్లీ సినిమాలపై ఫొకస్ చేసింది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి పై స్పందించింది..సామ్ తో విడాకులు తర్వాత నాగ చైతన్య ,శోభితని రీసెంట్‌గా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీరి పెళ్లిపై ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో రియాక్ట్ అయింది..మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా? అంటూ యాంకర్ సామ్ ని ప్రశ్నించగా..సామ్ మాట్లాడుతూ ‘నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావాలని కూడా అనుకోను. అసూయ అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను కూడా’ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా ‘ ఒక బంధం నుంచి బయట పడటం చాలా కష్టం’ అని కూడా ఆమె తెలిపింది. ప్రస్తుతం సమంత మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *