Kasthuri: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి కోర్టు మెట్లెక్కింది. తనపై వచ్చిన ఫిర్యాదులపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సంఘాల ఫిర్యాదులతో తమిళనాడు రాష్ట్రంలోని చోట్ల కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆమెకు పోలీసులు కాల్స్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆమెకు నోటీస్ ఇచ్చేందుకు ఇంటికి వెళ్తే, తాళం వేసి ఉన్నది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి నోటీస్ అతికించి వచ్చారు.
Kasthuri: ఆమె తన మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలతో తమిళనాడులోని తెలుగు జనం రగిలిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోనూ తెలుగు ప్రజలు ఆమెను ఈసడించుకుంటున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులతో ఆమె మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానున్నది.