Nagarjuna

Nagarjuna: ‘నషా ముక్త్ భారత్’ యాత్రలో నాగార్జున.. యువతకు కీలక పిలుపు!

Nagarjuna: యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్)లో టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ బృహత్తర కార్యక్రమానికి నాగార్జున తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ (ఫిల్మ్ నగర్) వరకు మూడు రోజుల పాటు సాగుతున్న ఈ అవగాహన పాదయాత్రలో భాగంగా నాగార్జునతో పాటు ప్రముఖ నటుడు సాయికుమార్, దర్శకుడు బోయపాటి శ్రీను కూడా పాల్గొని యువతలో చైతన్యం నింపారు.

2029 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను (Drug-Free India) నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నవంబర్ 19న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నాగార్జున ఈ యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను కూడా ఆవిష్కరించారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. డ్రగ్స్ మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ, యువతను ఈ ఉచ్చులో పడకుండా కాపాడటం మనందరి సామాజిక బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *