Actor ali: టాలీవుడ్ కమెడియన్ అలీకి షాక్ తగిలింది.ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకెళ్తే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది.
అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఈ నెల 22న మరోసారి నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చే సమయంలో ఆలీ లేకపోవడంతో ఆ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి నోటీసు అందించామని శోభారాణి చెప్పారు. కాగా, ఈ నోటీసులపై అలీ తన తరఫు న్యాయవాది ద్వారా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.