Acb raids: వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద అధికారిక పీఏగా మురళీ పని చేశారు. ఈయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మురళి సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంత గ్రామంతో పాటు బుడితి, లింగనాయుడిపేట, విశాఖపట్నంలోని మురళి నివాసాల్లో ముమ్మరంగా తనికీలు చేపట్టారు. చాలాసేపటి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను చూసినట్టు తెలుస్తుంది.