AAA sankranti sambaralu

AAA Sankranti Sambaralu: AAA సంక్రాంతి సంబరాలు.. కోటి సంగీత సుస్వరాలు

AAA Sankranti Sambaralu: అట్లాంటా, జార్జియా – ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవం అద్భుతంగా నిర్వహించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, అట్లాంటా తెలుగు వారికి వినూత్న అనుభవాన్ని అందించింది.

AAA అట్లాంటా చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ కమల్ బరవతుల – ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ సాయి చంద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం, వేలాదిగా హాజరైన ప్రజలను ఆనందంతో నింపింది. వారు తమ స్వస్థలం ఆంధ్రప్రదేశ్/ఇండియా నుంచి దూరంగా ఉన్నప్పటికీ, సంక్రాంతి ఉత్సవం యొక్క అద్భుతమైన ఆనందాన్ని అనుభవించారు.

AAA Sankranti Sambaralu: ఈ సందర్భంగా కోటి సుస్వరాల సంగీత దర్శకుడు కోటి అమెరికాలోని తెలుగువారి మధ్య AAA నిర్వహించిన సంక్రాతి సంబరాల్లో తన సంగీతంతో అలరించారు. హుషారైన పాటలతో . . కోటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తన డాన్సులతో సంక్రాతి సంగీత విభావరిని ఆద్యంతం సంబరంగా నిర్వహించారు .  ప్రేక్షకులతో కరచాలనం చేస్తూ . . కోటి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  

AAA ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లాంటాలో సంక్రాంతి సంబరాల్లో కోటి సంగీత సుస్వరాల వేడుక నుంచి కొన్ని మూమెంట్స్ మీకోసం చిత్రమాలికగా ఇక్కడ అందిస్తున్నాం . . 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *