CM Chandrababu:

CM Chandrababu: అమ‌రావ‌తిలో నేడు సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

CM Chandrababu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు (డిసెంబ‌ర్ 6) అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాల‌యాన్ని ఆయ‌న మ‌ధ్యాహ్నం సంద‌ర్శించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి ఆయ‌న విన‌తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే కార్యాల‌యం వ‌ద్ద బారులు తీరి ఉన్నారు.

CM Chandrababu: ప్ర‌తి నెల‌లో శ‌నివారం ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత అయిన నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ కార్యాల‌యానికి వ‌స్తారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి మాత్ర‌మే కాకుండా ఆయ‌న అభిమానులు కూడా పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తుండ‌టంతో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌ల నుంచి విన‌తుల‌ను స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించ‌నున్నారు.

CM Chandrababu: ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్కారానికి సంబంధిత శాఖ‌ల అధికారుల‌ను ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశిస్తారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న కోసం అమ‌రావ‌తిలో అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లను చేశారు. ఆయ‌న రాక‌తో సంద‌డి నెల‌కొన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *