Ashika Ranganath: ప్రముఖ నటి, ‘నా సామిరంగా’ ఫేమ్ అషికా రంగనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె బంధువైన అచల (22) బెంగళూరులోని బంధువుల ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 22న పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతున్న అచల కొంతకాలంగా దూరపు బంధువు మయాంక్‌తో పరిచయం కొనసాగించింది.అయితే డ్రగ్స్‌కు బాగా అలవాటు పడిన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని సమాచారం. ఆమె నిరాకరించడంతో మయాంక్ పలుమార్లు దాడి చేసి, మానసికంగా వేధించేవాడని అచల తల్లి విచారం వ్యక్తం చేసింది. ఫోన్ కాల్స్, బెదిరింపులు, నిరంతర వేధింపులు తట్టుకోలేక అచల ప్రాణాలను తీసుకున్నట్లు ఆమె ఆరోపిస్తోంది.
Also Read: Samantha: నా భర్తతో సమంత పెళ్లి!.. రాజ్ మాజీ భార్య శ్యామలి పోస్ట్ వైరల్..?
ఈ ఘటనపై అచల తల్లిదండ్రులు హసన్ సిటీ పోలీస్ స్టేషన్‌లో మయాంక్, అతని తల్లి మైనాపై కేసు నమోదు చేయించారు. అచల మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, విచారణను వేగంగా పూర్తి చేసి న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన జరిగి పది రోజులు అయినా, ఆధారాలు ఉన్నప్పటికీ అరెస్ట్‌లు జరగకపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అచల మరణం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలని, దోషులు శిక్షించబడాలనే కుటుంబ సభ్యుల ఆశ.
Beta feature
Beta feature

