SP Balasubrahmanyam

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!

SP Balasubrahmanyam: గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం మనల్ని విడిచి వెళ్లి నాలుగేళ్లు అయిపోయింది. అయినా, ఇప్పటికీ ఆయన తన గానామృతంతో మన మనస్సులో నిలిచే ఉన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే తిరుగులేని గాయకుడిగా బాలు తనదైన ముద్ర వేశారు. ఆ ముద్ర ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా చెరిపివేయలేనిది. 16 భాషల్లో తన గానామృతాన్ని పంచిన బాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలును అందరూ తలచుకున్నారు. ఆయన లేని లోటు తీరలేనిది అంటూ సినీ ప్రముఖులే కాకుండా.. సామాన్యుల దగ్గర నుంచి మాన్యుల వరకూ నివాళులర్పించారు. బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి బాలు అభిమానులకు ఒక పెద్ద తీపి కబురు చెప్పారు. అరుదైన గౌరవాన్ని బాల సుబ్రహ్మణ్య స్మృతికి కల్పించనున్నట్టు వెల్లడించారు. అదేమిటంటే, చెన్నైలోని ఒక ప్రధాన రహదారికి బాలు పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. 

SP Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం తెలుగు వాడైనప్పటికీ.. అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో అక్కడే స్థిర పడ్డారు. తమిళంలో కూడా వందలాది పాటలు బాలు పాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్టాలన్నిటా బాల సుబ్రమణ్యంకు కోట్లాది అభిమానులున్నారు. చెన్నైలో ఆయన నివసించిన ప్రాంతానికి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టనున్నారు. నుంగంబాక్కం లోని కస్తూరి నగర్ లో ఆయన నివసించారు. అందుకే ఆ ప్రాంతంలో ప్రధాన రహదారికి బాలు పేరు పెడుతున్నారు. దీనికి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సలై (రోడ్డు)గా నామకరణం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

SP Balasubrahmanyam: ఇదే విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా X పోస్ట్ ద్వారా వివరించారు. ‘‘కోట్ల మంది బాలు అభిమానుల్లో నేనూ ఒకడిని. ఆయన నివసించిన నగరంలోని ప్రధాన రహదారికి ఆయన పేరు పెడుతున్నాం.” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు. 

 మొత్తంగా చూసుకుంటే గాన గంధర్వుడిగా అందరి మనసుల్లోనూ నిలిచిన బాలసుబ్రహ్మణ్యం పేరు ఇప్పటి నుంచి చెన్నైలో ఒక రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు తెస్తుంది. .

Also Read: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం! 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *