Chikiri Chikiri Song

Chikiri Chikiri Song: చికిరి సాంగ్ మేకింగ్ వీడియో వైరల్!

Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ దాటిన ఈ గీతానికి సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట అన్ని భాషల్లో ట్రెండ్ అవుతుంది. యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుంది. ఈ పాటకు సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో పాట షూటింగ్‌కు సంబంధించిన అసలు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Samyuktha-Anirudha: రెండో పెళ్లి చేసుకున్న సంయుక్త, అనిరుధ్

మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సవల్య ఘాట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ ప్రదేశంలో ఎత్తైన కొండలు, చుట్టూ విస్తరించిన ఆకుపచ్చదనం ఉన్నప్పటికీ, ఆ కొండపై వాహనాలు చేరుకోవడానికి ఎటువంటి సౌకర్యం లేదు. కాబట్టి, సినిమా యూనిట్ మొత్తం దాదాపు 45 నిమిషాల పాటు కఠినమైన ట్రెక్కింగ్ చేస్తూ లొకేషన్‌కు చేరుకుంది. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, జాన్వీ కపూర్ తో పాటు సాంకేతిక సిబ్బంది అందరూ ఈ కష్టసాధనలో పాల్గొన్నారు. ఈ పాటను నిజమైన లొకేషన్‌లో, ఎటువంటి గ్రాఫిక్స్, సెట్స్ లేకుండా న్యాచురల్ గా చిత్రీకరించడం వల్ల ఇంత అద్భుతంగా తయారయ్యి ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *