TTD

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టిటిడి అధికారి అరెస్ట్‌!

TTD: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడికు చెందిన ఒక జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంను సీబీఐ నేతృత్వంలోని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌తో కేసులో పట్టుబడిన వారి సంఖ్య పదికి చేరింది. ఇంతకుముందు కేవలం నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు మరియు వారికి సహకరించిన వ్యాపారులను మాత్రమే సిట్‌ అరెస్టు చేసింది. అయితే, తాజాగా టిటిడి కొనుగోలు విభాగంలో ముఖ్య అధికారిగా ఉన్న జీఎం సుబ్రహ్మణ్యంను అరెస్టు చేయడంతో ఈ కేసులో పెద్ద అధికారి పాత్ర కూడా ఉందని స్పష్టమైంది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కల్తీ నెయ్యి కేసును సీబీఐ సిట్‌ దర్యాప్తు చేస్తోంది. టిటిడిలో కీలకమైన కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ అయిన సుబ్రహ్మణ్యం, కల్తీ నెయ్యిని అక్రమంగా కొనుగోలు చేయడానికి సహకరించినట్లు అధికారులు గుర్తించారు. అరెస్టు అనంతరం సుబ్రహ్మణ్యంకు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత, ఆయన్ని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన ఈ అక్రమంపై సిట్‌ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *