Biker

Biker: శర్వానంద్‌ ‘బైకర్‌’ రిలీజ్‌ వాయిదా!

Biker: చార్మింగ్‌ స్టార్‌ శర్వానంద్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘బైకర్‌’ రిలీజ్‌ డేట్‌ అధికారికంగా వాయిదా పడింది. డిసెంబర్‌ 6న రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు కొత్త తేదీ కోసం ఎదురుచూస్తోంది. శర్వానంద్‌ కెరీర్‌లో తొలి బైక్‌ రేస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘బైకర్‌’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు సృష్టించింది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 6న గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైందని మేకర్స్‌ ప్రకటించారు.

Also Read: Raju Weds Rambai: రాజు వెడ్స్‌ రాంబాయి ఫ్రీ షో…కానీ

కానీ ఇప్పుడు ఆ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సినిమా వర్క్స్‌ను మరింత పర్ఫెక్ట్‌గా పూర్తి చేయడానికి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభవం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని 3D, 4DX సహా అన్ని ఫార్మాట్లలో రిలీజ్‌ చేయనున్నారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రెట్టి బ్యూటీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *